YCP MLC Candidates : ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాల విడుదల.. అధికార పార్టీ అభ్యర్థులు వీరే

YCP MLC Candidates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటా 2.. మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

YCP MLC Candidates : ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాల విడుదల.. అధికార పార్టీ అభ్యర్థులు వీరే

YCP MLC Candidates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. స్థానిక సంస్థల కోటాలో 9, ఎమ్మెల్యే కోటాలో 7, గవర్నర్ కోటా 2.. మొత్తం 18 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిశోర్ సూచనల్ని వైసీపీ అధినేత జగన్ ప్రాధాన్యంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇందులో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఐపాక్ అధినేత సూచించారట. ఆ ప్రతిపదికనే అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ క్రిష్ణ రెడ్డి మాట్లాడుతూ.. 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన వెలువడిందని, ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయానికి వైసీపీ పెద్దపీఠ వేసిందని హర్షం వ్యక్తం చేశారు. మొదటి కాబినెట్ నుంచి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. సామాజిక న్యాయమనేది వైసీపీ విధానమని, 2014-19 మధ్య టీడీపీ 30 మంది ఓసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిందని, తాము 18 స్థానాలు ఖాళీ అయితే సింహభాగం సీట్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినట్లు స్పష్టం చేశారు.


సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందని కొనియాడారు. 18 ఎమ్మెల్సీ స్థానాలకు 11 మంది బీసీ, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. తాజా నిర్ణయంతో శాసనమండలిలో ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల సంఖ్య 68 శాతానికి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క బీసీలకే ఎమ్మెల్సీల్లో 43 శాతం అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ క్రిష్ణ రెడ్డి పేర్కొన్నారు.


స్థానిక సంస్థల కోటా

నర్తు రామారావు-యాదవ (శ్రీకాకుళం)
కుడిపూడి సూర్యనారాయణ-శెట్టిబలిజ (తూర్పుగోదావరి)
వంకా రవీంద్రనాథ్‌-కాపు (పశ్చిమగోదావరి)
కవురు శ్రీనివాస్‌-శెట్టిబలిజ (పశ్చిమగోదావరి)
మేరుగు మురళీధర్‌-మాల (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు)
సిపాయి సుబ్రహ్మణ్యం-వన్నెరెడ్డి (చిత్తూరు)
పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి-రెడ్డి (కడప)
ఎ.మధుసూదన్‌-వాల్మీకి బోయ (కర్నూలు)
ఎస్‌.మంగమ్మ-వాల్మీకి బోయ (అనంతపురం)


ఎమ్మెల్యేల కోటా

పెన్మత్స సూర్యనారాయణరాజు-రాజు (విజయనగరం)
పోతుల సునీత-పద్మశాలి (బాపట్ల)
కోలా గురువులు-బలిజ (విశాఖపట్నం)
బొమ్మి ఇజ్రాయల్‌-మాదిగ (బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ)
జయమంగళ వెంకటరమణ-వడీలు (ఏలూరు)
చంద్రగిరి ఏసురత్నం-వడ్డెర (గుంటూరు)
మర్రి రాజశేఖర్‌-కమ్మ (పల్నాడు)


గవర్నర్‌ కోటా

కుంభా రవిబాబు-ఎరుకల (అల్లూరి సీతారామరాజు)
కర్రి పద్మశ్రీ-వాడ బలిజ (మత్స్యకార) (కాకినాడ)