MLC Kavita : బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ…ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్

బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.

MLC Kavita : బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ…ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్

MLC Kavita

Updated On : February 20, 2023 / 3:36 PM IST

MLC Kavita : బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. తెలంగాణ మాదిరిగా దేశంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఏర్పడాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

దేశ వ్యాప్తంగా ప్రజానీకం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులవుతున్నారడానికి సాగర్ నిదర్శనమని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాందేడ్ లో నిర్వహించిన బహిరంగ సమావేశం మహారాష్ట్ర ప్రజానీకంపై గణనీయమైన ప్రభావం చూపిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Kalvakuntla Kavitha: అదానీ గురించి పార్లమెంటులో ప్రధాని మోదీ జవాబు చెప్పలేదు: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని అన్ని రాష్ట్రాల ప్రజల ఆకాంక్ష అన్నారు. అది కేవలం కేసీఆర్ తోనే సాధ్యమనే నమ్మకం ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.