పెన్షన్ రాలేదో పెట్రోల్ పోసి చంపుతా : చేతిలో కొడవలితో పంచాయతీ కార్యదర్శికి మహిళ వార్నింగ్

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ

  • Publish Date - November 12, 2019 / 02:28 AM IST

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ

అనంతపురం జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. వచ్చే నెల పెన్షన్ రాకపోతే పెట్రోల్ పోసి చంపుతామన్నారు. చేతిలో కొడవలితో ఓ మహిళ ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లడం, అధికారికి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. 

వచ్చే నెల పెన్షన్ రాలేదో.. పెట్రోలు పోసి చంపుతామని కొందరు వ్యక్తులు అధికారులను బెదిరించిన ఘటన అనంతపురం జిల్లా కూడేరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం(నవంబర్ 11,2019) చోటు చేసుకొంది. ఇప్పేరు గ్రామానికి చెందిన పెన్నోబులేశు, శివమ్మ మరో నలుగురు వ్యక్తులు కార్యాలయానికి వెళ్లారు. నవంబర్ నెల పెన్షన్ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను కోరారు. ఇప్పుడు ఇవ్వడానికి లేదు.. వచ్చే నెల ఇస్తాం అని ఆయన సమాధానమిచ్చారు. దీంతో వారు ఆగ్రహంతో ఊగిపోయారు. నవంబర్ నెల పెన్షన్ రాలేదో.. పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించారు.

పంచాయతీ కార్యదర్శి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. పెన్నోబులేశు, శివమ్మ, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా, శివమ్మ చేతిలో కొడవలి ఉండటం కలకలం రేపింది. ఆమె కొడవలి ఎందుకు తెచ్చిందన్న విషయమై సమగ్ర విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.