కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులను వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికోడ్కూరు వైసీపీ అభ్యర్థి ఆర్థర్ అడ్డుకున్నారు. టీడీపీ నేతలు ఓటర్లను భయాబ్రాంతులకు గురిచేస్తున్నారని కర్నూలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ముచ్చుమర్రి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రౌడీ షీటర్లతో డబ్బులు తీసుకొని ముచ్చుమర్రికి గ్రామానికి వచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అనుచరులను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. రౌడీ షీటర్లను నందికోడ్కూరుకు తీసుకొచ్చే అవసరం ఏమొచ్చిందని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈక్రమంలో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.