నగ్న ఫోటోలు పంపమని వేధిస్తున్న యువకుడు అరెస్టు

స్నేహం అనే పేరుకు మచ్చ తీసుకువచ్చాడు ఒకనీచుడు. స్నేహం  పేరుతో  యువతిని పరిచయం చేసుకుని కొంత కాలం అయ్యాక ఆమె నగ్న ఫోటోలు పంపమనివేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.  

హైదరాబాద్ బోడుప్పల్ ప్రాంతానికి చెందిన మోతె ప్రవీణ్ కుమార్ కు స్థానికంగా ఉంటున్న ఒక యువతి పరిచయం అయ్యింది. ఇద్దరూ స్నేహితులుగా మారి  కాలం మంచి, చెడు మాట్లాడుకుంటూ మంచి స్నేహితుల్లా కాలం గడుపుతున్నారు. కొంత కాలానికి ప్రవీణ్ కుమార్ బుధ్ది వక్రించింది. స్నేహితురాలిని కామ దృష్టితో చూడటం మొదలు పెట్టాడు. 
 

ఫేసు బుక్ లో రెండు నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి స్నేహితురాలి  నగ్న, అర్ధనగ్న ఫోటోలు పంపించమని   వేధించసాగాడు. ఆమె ఎంతకీ స్పందించకపోయే సరికి ఆమె పోటోలనే మార్ఫింగ్ చేసి  ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించటం మొదలెట్టాడు. రోజు రోజుకు అతని బెదిరింపులు ఎక్కువవటంతో  ఆయువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.