మోహన్ బాబుకు లీగల్ నోటీసులు : వైవీఎస్ చౌదరితో ముగియని వివాదం

  • Publish Date - April 9, 2019 / 01:33 PM IST

హైదరాబాద్: సలీం సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన  చెక్ బౌన్స్ కేసులో ఇటీవలే జైలు శిక్షపడితే, బెయిల్ తెచ్చుకుని ఊపిరి పీల్చుకుంటున్న  సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు, దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి మంగళవారం లీగల్ నోటీసులు పంపారు.  
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను

చెక్ బౌన్స్ కేసులో వైవీఎస్ చౌదరికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినప్పటినుంచి  మోహన్ బాబు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ,  చౌదరి తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. సలీం చిత్ర నిర్మాణ సమయంలోనే  జల్పల్లి గ్రామంలో మోహన్బాబు నివసిస్తున్న ఇంటిని ఆనుకుని ఉన్న అర ఎకరం స్ధలాన్ని వైవీఎస్ చౌదరి కొన్నానని చెప్పారు.

చెక్ బౌన్స్ కేసు తీర్పు  అనంతరం మోహన్ బాబు, ఆయన మనుషులు …తన స్ధలంలోకి…తనను, తన మనుషులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని చౌదరి ఆరోపించారు. తాను కష్టార్జితంతో కొనుకున్న స్ధలం విషయంలో మోహన్ బాబు అడ్డంకులు సృష్టించడంతో చౌదరి శాశ్వత పరిష్కారం కోసం న్యాయనిపుణుల సలహా తీసుకుని మోహన్ బాబుకు లీగల్ నోటీసులు పంపించారు. 
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం