మహిళలకు అత్యంత సేఫెస్ట్ ప్లేస్‌గా కోల్‌కతా

NCRB డేటా ఆధారంగా Kolkata చక్కటి ఘనత సాధించింది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులు అక్కడ సున్నా శాతం నమోదవుతున్నాయని రికార్డ్ అయింది. మెట్రోపోలీస్ స్టాఫ్ కూడా ఎటుంటి రేప్, లైంగిక వేధింపుల వంటి కేసులు నమోదు చేయలేదని వెల్లడించింది.

Kolkataలో 2019వ సంవత్సరం కేవలం 18ఏళ్లు పైబడ్డ వారే లైంగిక కేసుల అంశంలో కంప్లైంట్ చేశారని వెల్లడించింది. రీసెంట్‌గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో Kolkata సిటీలో 14కేసులు నమోదైనట్లు తెలిపింది.



Kolkata మాదిరిగానే తమిళనాడు, కొయంబత్తూరులలో ఎటువంటి లైంగిక వేధింపుల కేసు నమోదుకాలేదని పీటీఐ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.

డేటా ప్రకారం.. ఢిల్లీలో గతేడాది నమోదైన మహిళలపై హింసాత్మక కేసులు 12వేల 900కు పైనే. ముంబైలో 6వేల 519కేసులు ఫైల్ చేశారు ముంబై పోలీసులు. ఉత్తరప్రదేశ్‌లో(59వేల 853), మహారాష్ట్రలో (37వేల 144), రాజస్థాన్‌లో (41వేల 550)కేసులు నమోదయ్యాయట.

Kolkata మహిళలకు సేఫ్ ప్లేస్‌గా ఉండటానికి.. చక్కటి పాలసీ ఫాలో అవుతున్నారు. చాలా విషయాల్లో అవగాహన పెంచుకున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. NCRB డేటాను బట్టి ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో 59కేసులు ఫైల్ అయ్యాయి. ఢిల్లీలో వెయ్యి 231కేసులు నమోదై టాప్ లో ఉంది.

ఇక మహిళలకు అంత సేఫ్ కాని ప్లేస్ లలో టాప్ గా రాజస్థాన్ ఉంది. రేప్ లు, లైంగిక వేధింపులు, గృహ హింస కేసుల్లో 18వేల 432కంప్లైంట్లు ఉన్నాయి.