Anganwadi Teacher Jobs : ఇంటర్ పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. 181 అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగాలు.. జూలై 29 నుంచే అప్లికేషన్స్!
Anganwadi Teacher Jobs : అంగన్‌వాడీలో ఉద్యోగాలు పడ్డాయి. మొత్తం 181 ఖాళీలకు దరఖాస్తులను కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకించి హైదరాబాద్ లోని ఖాళీల కోసం మహిళలు అప్లయ్ చేసుకోవచ్చు.
- Sreehari A
- Published on- July 28, 2026 / 09:22 PM IST
Anganwadi Teacher Jobs
- ఇంటర్ పాసైన మహిళలకే అవకాశం
- రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులు
- జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం
Anganwadi Teacher Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న మహిళలకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. హైదరాబాద్ జిల్లాలో 5 ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఖాళీ అయిన 181 అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు జులై 29, 2026 నుంచి ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశలవారీగా ఈ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆయా నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది. తాజాగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మేడ్చల్ జిల్లాలో కూడా నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రాజెక్టుల వారీగా ఖాళీలివే :
చార్మినార్ : 40 పోస్టులు
గోల్కొండ : 27 పోస్టులు
ఖైరతాబాద్ : 17 పోస్టులు
నాంపల్లి : 38 పోస్టులు
సికింద్రాబాద్ : 59 పోస్టులు
అర్హతలు ఏంటి? :
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు అప్లయ్ చేసుకునే మహిళలు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. హెల్పర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉండే అభ్యర్థులు లేకుంటే 10వ తరగతి పాస్ అయిన వారిని ఎంపిక చేస్తారు.
Read Also : Dhanush-Vishal-Suriya : అక్కడ స్పేస్ లేదు.. కానీ వాళ్లు క్రియేట్ చేస్తున్నారు..
అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారులు స్థానిక మహిళలై ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత వార్డు, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత గ్రామపంచాయతీ పరిధిలో నివాసం తప్పనిసరిగా ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
అంగన్‌వాడీ టీచర్ పోస్టుల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించనుంది. ఎంపికలో ఇంటర్మీడియట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. అదనంగా వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం వెయిటేజీ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలివే :
అప్లికేషన్ ప్రారంభం : జులై 29, 2026
లాస్డ్ డేట్ : ఆగస్టు 22, 2026
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ : ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు
జాబ్ కోసం చూసే అర్హత ఉన్న మహిళలకు అద్భుతమైన ఛాన్స్.. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉంటే గడువులోపు ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
