513 vacancies in Indian Oil Corporation Limited
IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 513 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కెమికల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఫిజిక్స్/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iocl.com/