TS Open School and Open Inter: తెలంగాణ ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్‌లో అడ్మిషన్లు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి

TS Open School and Open Inter: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్‌లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Telangana Open school society admissions open

చాలా మంది పిల్లలు, యువకులు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేది ఎదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికోసం తీసుకువచ్చిందే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఏదైనా పని చేసుకుంటూ చదువుకోవాలని అనుకునేవారికి ఇది చాలా మంది అవకాశం అనే చెప్పాలి. అయితే 2025-26 సంవత్సరానికి గాను ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్‌లో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో పదవతరగతి, ఇంటర్ రెండు పూర్తి చేసి సౌలభ్యం ఉంది. అయితే ఇంటర్ చేయాలనుకుంటున్న వారు మాత్రం తప్పకుండ 10th పాసై ఉండాలి.

అర్హతలు:

  • ఓపెన్ 10th కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 ఏళ్లు ఉండాలి.
  • ఓపెన్ Inter కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి. దీనికి అన్ని వయస్సుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: జూలై 11, 2025

దరఖాస్తు ప్రక్రియ:
TG Online లేదా MeeSeva లో తగిన ఫీజు చెల్లించి మీ దగ్గరలోని ఓపెన్ స్కూల్ కేంద్రంలో అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

కేవలం సెలవుల్లో మాత్రమే తరగతులు జరుగుతాయి. రెండో శనివారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో పాఠాలు చెప్తారు. ఇందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు సైతం కేంద్రాల్లోనే లభిస్తాయి.