Amazon Scholarship 2026-27 : ఇంజినీరింగ్ చదువుతున్నారా? అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.2 లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు ఫ్రీ ల్యాప్‌టాప్!.

Amazon Future Engineer Scholarship 2026-27 : ఇంజినీరింగ్ విద్యార్థులకు అమెజాన్ బంపర్ ఆఫర్.. (అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్ షిప్ 2026-27) ద్వారా రూ.2 లక్షల స్కాలర్‌షిప్, ఫ్రీ ల్యాప్‌టాప్, పెయిడ్ ఇంటర్న్‌షిప్ పొందవచ్చు. అర్హతలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలేవి..

Amazon Future Engineer Scholarship 2026-27

  • అమెజాన్ స్కాలర్‌షిప్ 2026-27 ప్రొగ్రామ్ మీకోసమే
  • పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్, ట్రైనింగ్, ఉద్యోగ అనుభవం
  • ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నవంబర్ 30లోపు అప్లయ్ చేయొచ్చు

Amazon Future Engineer Scholarship 2026-27 : ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా విద్యార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు (Foundation for Excellence (FFE)తో కలిసి అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్ షిప్ 2026-27 ప్రొగ్రామ్ తీసుకొచ్చింది.

ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు ఏకంగా రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు.. ఫ్రీ ల్యాప్‌టాప్, టెక్నికల్ ట్రైనింగ్, మెంటార్‌షిప్‌తో పాటు పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం కూడా కల్పించనుంది..

ఏడాదికి రూ.50 వేలు.. మొత్తం రూ.2 లక్షలు :
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రూ.50వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందుతుంది. అంటే.. మొత్తం రూ.2 లక్షల వరకు పొందవచ్చు. మొదటి ఏడాది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ కూడా ఇస్తారు.

Read Also : India First Bullet Train : 280 కి.మీ. స్పీడ్.. 8 కోచ్‌లు.. 557 మంది ప్రయాణం! భారత్ తొలి బుల్లెట్ ట్రైన్‌లో ప్రత్యేకతలివే..!

అమెజాన్ ఇంజినీర్లతో మెంటార్‌షిప్, టెక్నికల్ బూట్‌క్యాంప్స్, వెబినార్లు, స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. రెండో సంవత్సరం పూర్తయ్యాక అర్హులైన వారికి అమెజాన్‌లో 8 వారాల పెయిడ్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుంది..

ఎవరు అర్హులు? :

  • గుర్తింపు పొందిన భారతీయ కళాశాలల్లో బీటెక్ లేదా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్ చేరినవారు అర్హులు.
  • కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా సంబంధిత విభాగాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మెరిట్ ఆధారిత ప్రవేశ పరీక్ష లేదా కౌన్సెలింగ్ ద్వారా సీటు పొంది ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి.
  • ప్రతిభావంతులైన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే :
10వ తరగతి, ఇంటర్ మార్కుల వివరాలు, ఎంట్రన్స్ ర్యాంక్ కార్డు, కాలేజీ అడ్మిషన్ వివరాలు, ఫీజు రసీదు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు రెడీగా ఉంచుకోవాలి.

ఎలా అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడంటే? :
అర్హులైన విద్యార్థులు (Foundation for Excellence) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.. (Amazon Future Engineer Scholarship 2026-27) అప్లికేషన్ లింక్ ద్వారా అప్లయ్ చేయాలి. వ్యక్తిగత, విద్యా వివరాలు రిజిస్టర్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

లాస్ట్ డేట్ : నవంబర్ 30, 2026 :
అర్హత ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడొద్దు.. ముందుగానే అప్లయ్ చేసుకోవడం మంచిది..