AP DSC 2026 : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ఏపీ డీఎస్సీకి అప్లికేషన్ పెట్టారా? లాస్ట్ డేట్ ఇదే!

AP DSC 2026 : ఏపీ డీఎస్సీ 2026 ద్వారా 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 30 చివరి తేదీ. అర్హతలు, ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ వివరాలివే..

AP DSC 2026

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
  • టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?
  • 2,721 టీచర్ ఉద్యోగాలు.. తొలిరోజే భారీ స్పందన..

AP DSC 2026 : గవర్నెంట్ టీచర్ ఉద్యోగం కోసం చూస్తున్నారా? టీచర్ జాబ్ ప్రిపరేషన్ చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుతమైన ఛాన్స్ అందిస్తోంది.. రాష్ట్రంలో 2,721 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నియామకాలను చేపట్టనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, తాజాగా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. దీంతో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి..

నవంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. చివరి తేదీ దగ్గర పడే వరకు వేచి చూడకుండా ముందుగానే అప్లయ్ చేసుకోవడం మంచిది..

ఫస్ట్ డేనే భారీ రెస్పాన్స్ :
డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం రోజే అభ్యర్థుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 11న ఒక్కరోజులోనే 397 మంది అభ్యర్థులు మొత్తం 487 పేపర్లకు అప్లయ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. రాబోయే రోజుల్లో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అప్లయ్ చేసే ముందు తప్పక తెలుసుకోండి :
డీఎస్సీకి సంబంధించిన పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ స్పెషల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. నోటిఫికేషన్, పోస్టుల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, పరీక్షల షెడ్యూల్, సిలబస్, ప్రభుత్వ ఉత్తర్వులు, హెల్ప్‌డెస్క్ వివరాలను అక్కడ చెక్ చేసుకోవచ్చు..

Read Also : RAC టికెట్లపై రైల్వే శాఖ సంచలనం.. ఇక నుంచి..

అభ్యర్థులు అప్లికేషన్ పెట్టే ముందు తమ విద్యార్హతలు, అవసరమైన సర్టిఫికెట్లు, ఇతర నిబంధనలను ఒకసారి చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు రిజిస్టర్ చేసేటప్పుడు కూడా తప్పులు లేకుండా చూసుకోవాలి.

మొత్తానికి 2,721 టీచర్ పోస్టులతో వచ్చిన ఈ డీఎస్సీ నిరుద్యోగులకు అద్భుతమైన ఛాన్స్.. అర్హత ఉన్నవారు ఆలస్యం చేయకుండా నవంబర్ 30లోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఉద్యోగం సాధించాలనే కలను నిజం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పరీక్షకు సన్నద్దమవ్వాలి..

నవంబర్ 5న నోటిఫికేషన్ విడుదల కాగా నవంబర్ 11 నుంచి దరఖాస్తుల ప్రారంభమయ్యాయి. నవంబర్ 30 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం పోస్టులు 2,721 ఉంటే తొలిరోజు 397 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో దరఖాస్తు చేసిన పేపర్లు 487 ఉన్నాయి..