AP Mega DSC: ఏపీలో డీఎస్సీకి అప్లయ్ చేస్తున్నారా..? ఎలా అప్లయ్ చేయాలో క్లియర్ గా ఇక్కడ తెలుసుకోండి..

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది.

AP DSC Ntification Released

AP Mega DSC: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉదయం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి.

Also Read: Chandra Babu Birthday: సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. ప్రధాని మోదీ, జగన్ సహా..

ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్ లైన్ లోనే దరఖాస్తులు స్వీకరణ, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది. అలాగే జూన్ 5వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు ఈ పరీక్షలను పటిష్ఠంగా నిర్వహించనున్నారు. మోగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

Also Read: AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ -2025 నోటిఫికేషన్‌ విడుదల.. పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూల్.. సిలబస్ పూర్తి వివరాలు ఇలా..

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో.. డీఎస్సీకి అప్లయ్ చేసుకునేవారికి ఎలా అప్లయ్ చేసుకోవాలో పూర్తి వివరాలతో కూడిన వీడియోను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఆ వీడియోలో అప్లీకేషన్ ప్రాసెస్ ఎంట్రీ.. ఎన్ని స్టెప్పులు ఉన్నాయి. ఏ అభ్యర్థులు ఎలా అప్లయ్ చేయాలి.. నగదు పేమెంట్ ఎలా చేయాలనే పూర్తి సమాచారాన్ని సులభతరం చేస్తూ వివరించారు.

తెలుగులో..