ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను 2025 ఏప్రిల్ రెండవ వారం నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. విద్యార్థుల మార్కులను ఈ సారి వాట్సాప్ ద్వారా కూడా చూసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఏడాది మార్చి 1న ప్రారంభమై మార్చి 19న ముగిశాయి. సెకండియర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభమై మార్చి 20న ముగిశాయి. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది.
పరీక్షల ఫలితాలు 2024లో ఏప్రిల్ 12న, 2023లో ఏప్రిల్ 26న, 2022లో జూన్ 22న విడుదల చేశారు. దీంతో, ఏపీ ఇంటర్ ఫలితాలను 2025లో ఏప్రిల్ 10 – 15 మధ్య వస్తాయని అంచనా వేయొచ్చు.
Also Read: ఆస్తులపై సుప్రీంకోర్టు సంచలన ప్రకటన.. ఇకపై ఏం చేస్తారంటే?
వాట్సప్‌లో ఇలా చెక్ చేసుకోండి..
ఆన్‌లైన్‌లో ఎలా చూసుకోవాలి?
bieap.gov.in
resultsbie.ap.gov.in
మీ హాల్ టికెట్ నంబరు టైప్ చేసి ఈ పై రెండు వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు.