Supreme Court: ఆస్తులపై సుప్రీంకోర్టు జడ్జిల సంచలన ప్రకటన.. ఇకపై ఏం చేస్తారంటే..
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ భేటీ అయ్యారు.

Supreme Court
ఢిల్లీ హైకోర్టు జడ్జీగా కొనసాగిన జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల పెద్ద ఎత్తున కరెన్సీని గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో జడ్జీల అవినీతి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను బయటపెట్టేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఫుల్ కోర్టు భేటీలో ఇందుకు జడ్జీలు అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.
రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ భేటీ అయ్యారు. ఆస్తుల వివరాలను న్యాయస్థాన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి అంగీకరించారు.
ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరుగుతాయి.. ఇప్పుడే కొనుక్కోండి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాతో మరో 29 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల డిక్లరేషన్లను ఇచ్చారు. ఇప్పటికే ఉన్న రూల్స్ ప్రకారం దేశ సర్వోన్నత న్యాయస్థాన జడ్జీలు ప్రమాణస్వీకారం చేశాక తమ ఆస్తుల వివరాలను సీజేఐకి ఇవ్వాల్సి ఉంటుంది.
In a significant step towards transparency and boosting public confidence in the judiciary, all Judges of the Supreme Court have agreed to make the declaration of their assets publicly available.
Read more: https://t.co/RYuF3tG4Bk#SupremeCourt pic.twitter.com/8UXbwxS5Bb— Live Law (@LiveLawIndia) April 3, 2025
ఆ ఆస్తులను బహిర్గతం చేయాలన్న నిబంధనలు లేవు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో జడ్జీల ఆస్తుల డిక్లరేషన్లకు సెక్షన్ ఉంది. కొన్నేళ్లుగా ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ కనపడడం లేదు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తులను బయటపెట్టేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా నిర్ణయం తీసుకుంది.