ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేశారు. bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు విద్యార్థులు చదువుకుంటున్న స్కూల్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్ నుంచే కాకుండా మన మిత్ర, వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చు. అందుకోసం విద్యార్థులు అప్లికేషన్ నంబరు, ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయి.