APPSC Group 1 Recruitment 2026 : డిగ్రీ ఉంటే చాలు.. డిప్యూటీ కలెక్టర్ నుంచి డీఎస్పీ వరకు.. గ్రూప్-1 సిలబస్, ఎంపిక విధానం ఇదే!
APPSC Group 1 Recruitment 2026 : ఏపీపీఎస్సీ గ్రూప్-1లో 166 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. డిగ్రీ అర్హత, వయోపరిమితి, పోస్టుల వివరాలు, ప్రిలిమ్స్ పరీక్ష విధానం, నెగెటివ్ మార్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
- Sreehari A
- Updated on- October 19, 2026 / 06:44 PM IST
APPSC Group 1 Recruitment 2026
- ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్..
- ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎలా ఉంటాయంటే?
- ఏపీ గ్రూప్-1 పోస్టులు, అర్హతలు, పరీక్షల వివరాలివే
- 166 పోస్టులు, పరీక్ష విధానం తెలుసుకోండి
APPSC Group 1 Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయి అధికారిగా ఎదగాలనుకుంటున్నారా? అయితే, ఏపీపీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాలపై ఫోకస్ పెట్టండి.. ప్రస్తుతం గ్రూపు-1కు సంబంధించి మొత్తం 166 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. అర్హతలు, పరీక్షల విధానం ఏంటి? ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఎలా మొదలుపెట్టాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం..
ఏయే పోస్టులంటే? :
ఈ నియామకాల్లో డిప్యూటీ కలెక్టర్ 12, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ 14, డీఎస్పీ (సివిల్) 36, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) 3, డీటీఓ 14, ఆర్డీఓ 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ అధికారి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలివే :
చాలా పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసినవారే అప్లయ్ చేసుకోవచ్చు. అయితే, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టుకు సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ అవసరం. వయోపరిమితి పోస్టును బట్టి మారుతుంది. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులకు వయోసడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం ఎలాగంటే? :
గ్రూప్-1 ఎంపిక ప్రక్రియలో స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 240 మార్కులకు నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉండగా, ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్న మార్కుల్లో మూడో వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
అందుకే ప్రిపరేషన్‌తోపాటు సమాధానాలను జాగ్రత్తగా గుర్తించడం ముఖ్యం. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించినవారు మెయిన్స్‌కు ఎంపికవుతారు. తుది ఎంపికకు సంబంధించిన మార్కులు, అర్హతలు, పోస్టులవారీ నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.
