డౌన్‌లోడ్ చేసుకోండి : ఏప్రిల్ 15 నుంచి గ్రూప్ 3 హాల్ టికెట్లు

  • Publish Date - April 14, 2019 / 02:04 AM IST

అమరావతి : పంచాయతీ కార్యదర్శి (గ్రూప్‌-3 సర్వీసెస్‌) పోస్టులకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఫీజు కట్టేసి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 21న పంచాయతీ కార్యదర్శుల (గ్రూప్‌-3 సర్వీసెస్‌) స్ర్కీనింగ్‌ టెస్ట్‌ జరగనుంది. ఈ పరీక్ష హాల్‌ టికెట్లను ఏప్రిల్ 15వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పబ్లిస్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తెలిపింది. https://psc.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది. గ్రూప్ 3 పరీక్షకు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష దగ్గర పడంతో అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. దీంతో ఏపీపీఎస్సీ వర్గాలు అభ్యర్థులకు సమాచారం ఇచ్చాయి.

కాగా.. గ్రూపు-2, గ్రూప్‌-3 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్లు వచ్చాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఏపీపీఎస్సీ చైర్మన్‌‌ని కోరారు. ఏప్రిల్ 21న జరిగే గ్రూప్‌-3 పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమినరీ  పరీక్షను, మే 5న జరిగే గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని ఆయన అభ్యర్థించారు. ఎన్నికల వాతావారణంతో పాటు, 21న ఈస్టర్‌ పండుగ ఉందన్నారు. 21న SI మెయిన్‌ పరీక్షతో పాటు కొన్ని పరీక్షలు జరగనున్నాయని వివరించారు. దీంతో పరీక్షలను పోస్ట్ పోన్ చెయ్యాలన్నారు. లక్ష్మణరావు అభ్యర్థనపై ఏప్రిల్ 16న జరిగే కమిషన్‌ సమావేశంలో పరిశీలిస్తామని చైర్మన్‌ ఉదయభాస్కర్‌ హామీఇచ్చారు. ఇంతలో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోండి అని చెప్పడం చూస్తుంటే.. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరిగేలా ఉన్నాయని తెలుస్తోంది.