APPSC Notification : ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపిపిఎస్సీ నోటిఫికేషన్
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల వయస్సు 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.24,400 నుంచి రూ.71,500 వరకు చెల్లిస్తారు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- Guntupalli Ramakrishna
- Published On : November 10, 2021 / 02:14 PM IST
Jobs Appsc
APPSC Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు గ్రేడ్-1కు సంబంధించి మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల వయస్సు 2021 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు వేతనంగా రూ.24,400 నుంచి రూ.71,500 వరకు చెల్లిస్తారు. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు, కామన్ పేపర్ హోమ్ సైన్స్ అండ్ సోషల్ వర్క్ నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. డిగ్రీ స్థాయిలో ప్రశ్నల సరళి ఉంటుంది.
అభ్యర్ధినులు తమ ధరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబరు 18 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 08, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://psc.ap.gov.in/(S(czxwcxrcqqaf1qnexvs1bl10))/Default.aspx
