APPSC Recruitment 2026 : మహిళలకు గుడ్‌న్యూస్.. డిగ్రీ పాసైతే చాలు.. ప్రభుత్వ ఉద్యోగం.. జీతం నెలకు రూ.1.15 లక్షలు..!

APPSC Supervisor Grade-1 Jobs 2026 : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం 29 ప్రభుత్వ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి.. దరఖాస్తు లాస్ట్ డేట్ నవంబర్ 5 వరకు మాత్రమే.. ఎంపిక విధానం, అప్లికేషన్ పూర్తి వివరాలివే..

APPSC Recruitment 2026

  • మహిళా అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 5లోగా అప్లై చేయండి
  • ఏపీపీఎస్సీ నుంచి 29 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఉద్యోగం..
  • ఏపీలో సూపర్‌వైజర్ పోస్టులు.. నోటిఫికేషన్ వివరాలివే

APPSC Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త.. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 29 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి పోస్టుల వివరాలివే..

ముఖ్యమైన తేదీలివే :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 16న ప్రారంభమైంది. నవంబర్ 5, 2026 రాత్రి 11:59 గంటల వరకు అప్లయ్ చేసుకునే (APPSC Recruitment 2026) అవకాశం ఉంది. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా అభ్యర్థులు ముందుగానే అప్లికేషన్ పూర్తి చేయడం బెటర్..

Read Also : AP Weather Update : ఏపీకి తుఫాన్ ముప్పు.. భారీ వర్షాల అలర్ట్! బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రజలు అప్రమత్తం!

విద్యార్హతలేంటి? :
సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన మహిళలకు అర్హత ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, బోటనీ, జూలజీ, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలను చెక్ చేయడం బెటర్.. వయోపరిమితి, రిజర్వేషన్ల ప్రకారం వయోసడలింపులు, ఇతర విద్యార్హతల వివరాలను కూడా ఓసారి చెక్ చేసుకోండి.

జీతం ఎంత? ఎంపిక ఎలా? :
ఈ పోస్టులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు శాలరీ రేంజ్ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా జరగనుంది. పరీక్షల సిలబస్, మార్కుల విభజన, అర్హత ప్రమాణాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.

ఎలా అప్లయ్ చేయాలి? :
ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి (Supervisor Grade-1 Recruitment 2026) నోటిఫికేషన్‌ను పరిశీలించాలి. అనంతరం అర్హతలు, ఫీజు, అవసరమైన సర్టిఫికేట్ల వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి. ఫొటో, సైన్ వంటి వివరాలను అప్‌లోడ్ చేయాలి.. రుసుము చెల్లించి అప్లికేషన్ సమర్పించాలి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్లిప్ దగ్గర పెట్టుకోవాలి.