Job Search
Job Search : చదువు పూర్తయిన వెంటనే జాబ్ కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. అయితే ఉద్యోగం కోసం ఎలా ప్రయత్నించాలో చాలా మందికి తెలియదు. అప్పటి వరకు పుస్తకాలపై కుస్తీ పట్టి బావిలో కప్పలా ఉండే జీవితాలకు అప్పుడు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టటంతో అంతా కొత్తకొత్తగా ఉంటుంది. అలాంటి వారికి ఉద్యోగం ఎలా పొందాలి. అందుకోసం ఏంచేయాలన్న విషయం బోధపడటానికి కొంత సమయం తీసుకుంటుంది. అలాంటి వారు తప్పనిసరిగా మేము చెప్పబోయే వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉద్యోగ నియమాకాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ రకాల మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు. వార్త పత్రికల్లో ఉద్యోగ ప్రకటనలు , ఇంటర్నెట్ లో పలు న్యూస్ వెబ్ సైట్స్, జాబ్ వెకేక్సీ వెబ్ సైట్స్, పలు కంపెనీలు తమ సంస్ధ వెబ్ సైట్ లలోనే ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఉంచుతాయి. లింక్డ్ ఇన్ వంటి వెబ్ సైట్లలో మీ వివరాలను నమోదు చేయటం ద్వారా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన వివరాలను పొందవచ్చు. ఇక స్నేహితులు, వివిధ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా ఉద్యోగాల భర్తికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.
జాబ్ బోర్డ్స్ లో వివిధ ఉద్యోగ ఖాళీల సమాచారం లభిస్తుంది. పలు సంస్ధలు జాబ్ బోర్డ్సు, జాబ్ బ్యాంకులను ఉద్యోగ వివరాలకు అందుబాటులో ఉంచుతున్నాయి. మాన్ స్టర్.కామ్, గూగుల్ ఫర్ జాబ్స్, కెరియర్ బిల్డర్ వంటి అనేక కెరయర్ వెబ్ సైట్లు ఉద్యోగ సమాచారాన్ని అందిస్తున్నాయి. వివిధ రంగాల వారిగా పలు రకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్ధలు ఉద్యోగాల భర్తీ ప్రకటనలు విడుదల చేయకుండా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు పరిచయస్తుల ద్వారా వచ్చిన వారిని ఉద్యోగులుగా నియమించుకుంటుంటాయి. వివిధ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా కూడా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలు తెలుసుకుని వారి రిఫరెన్స్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.
పెద్ద సంస్ధలు తమకు కావాల్సిన ఉద్యోగులను నియమించుకునేందుకు క్యాంపస్ సెలక్షన్స్, జాబ్ ఫేర్స్ నిర్వహిస్తాయి. విద్యాసంస్ధల్లోనే ఇలాంటివి నిర్వహించిన సందర్భంలో అక్కడికక్కడే మీలో ఉన్న స్కిల్స్, అర్హత అధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. పలు కంపెనీలు తమ వెబ్ సైట్లలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తుంటాయి. అలాంటి వాటిని గమనిస్తుండాలి. ఏదిఏమైన చదువు పూర్తి చేసుకున్న వారు ఉద్యోగం దొరకాలంటే కాస్తంత ప్రయత్నం చేయటం తప్పనిసరి. ధరఖాస్తు చేసిన వెంటనే ఉద్యోగం వస్తుందన్న ఆకాంక్ష ఉండటం లో తప్పులేదు. అయితే అన్ని సందర్భాల్లో అది సాధ్యంకాదు. ఉద్యోగం రాలేదని నిరుత్సాహ పడకుండా ప్రయత్నిస్తుంటే ఏదో ఒక సమయంలో తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది.