AP Tenth Exams Schedule: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
AP Tenth Exams Schedule Representative Image (Image Credit To Original Source)
- టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్
- పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది
- మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్
AP Tenth Exams Schedule: ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వ తేదీన చివరి ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. షెడ్యూల్ వచ్చేయడంతో విద్యార్థులు అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ ను ముమ్మరం చేయాలి.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్..
మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20న ఇంగ్లీష్
మార్చి 23న గణితం (మ్యాథ్స్)
మార్చి 25 ఫిజికల్ సైన్స్
మార్చి 28న బయోలాజికల్ సైన్స్
మార్చి 30న సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1న ఎస్ఎస్ సీ వొకేషనల్ కోర్స్ (థియరీ)

SSC Exams Schedule Representative Image (Image Credit To Original Source)
మార్చి 30వ తేదీతో మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టు (కాంపోజిట్ కోర్స్), ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్షలు ఉంటాయి. ఇక, ఏప్రిల్ 1న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2తో(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పాటుగా.. ఎస్ఎస్ సీ వొకేషనల్ కోర్స్ థియరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ తో పాటు ఒకేషనల్ కోర్సులు వంటి కొన్ని నిర్దిష్ట పేపర్లకు మాత్రం పరీక్ష ముగింపు సమయం 11గంటల 30 నిమిషాల వరకే ఉంటుంది.
