BOM Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు పడ్డాయి.. పరీక్ష లేకుండా జాబ్ కొట్టొచ్చు.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

BOM Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మొత్తం 172 పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది.

Bank Of Maharashtra Recruitment 2025

BOM Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు పడ్డాయి. బ్యాంక్‌లో జనరల్ మేనేజర్ ఉద్యోగం కోసం ప్లాన్ చేస్తున్న యువతకు అద్భుతమైన అవకాశం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వివిధ స్కేల్స్ II, III, IV, V, VI, VII కింద స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

మీకు ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు కూడా ఉంటే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్ (bankofmaharashtra.in)ని విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Read Also : RRB Group D : రైల్వేలో గ్రూపు-డి జాబ్స్ పడ్డాయి.. 32,438 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పది పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు..!

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి.

మీరు కూడా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలని చూస్తుంటే.. మీరు ఫిబ్రవరి 17వ తేదీలోగా లేదా అంతకుముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎవరైనా అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను తప్పక కలిగి ఉండాలి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దరఖాస్తు రుసుము :
జనరల్/EWS/OBC కేటగిరీలకు దరఖాస్తు రుసుము : రూ. 1180 (18శాతం జీఎస్టీ సహా)
SC/ST/PWBD వర్గాలకు దరఖాస్తు రుసుము : రూ. 118 (18శాతం జీఎస్టీ సహా)

వయో పరిమితి :
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయోపరిమితి 22 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :
ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. మొత్తం 100 మార్కులలో, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 50 మార్కులు, SC/ST/PWBD అభ్యర్థులకు కనీసం 45 మార్కులు అవసరం.

ముఖ్యమైన తేదీల, దరఖాస్తు ప్రక్రియ :
అర్హత గల అభ్యర్థులు చివరి తేదీలోపు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు తేదీ తర్వాత దరఖాస్తును అంగీకరించరు. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి నోటిఫికేషన్‌‌లో దరఖాస్తుకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను అనుసరించాలి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా దరఖాస్తు చేయాలి? :

  • అధికారిక వెబ్‌సైట్‌ (bankofmaharashtra.in) ను సందర్శించండి
  • రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి, రిజిస్టర్ చేసుకోండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  • దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • ఫారమ్‌ను సమర్పించండి.

ఈ పోస్టులకు అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. మొత్తం 100 మార్కులలో, జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 మార్కులు, SC/ST/PWD అభ్యర్థులు కనీసం 45 మార్కులు పొందాలి.

Read Also : రూ.65వేల జీతంతో మెట్రోలో ఉద్యోగాలు.. ఫుల్ డిటెయిల్స్..