BPCL Recruitment : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 2020, 21, 22 ఏడాదుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : August 28, 2022 / 12:49 PM IST
Bharat Petroleum Corporation Limited
BPCL Recruitment : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
వీటిలో కెమికల్ ఇంజనీరింగ్ 31 ఖాళీలు, సివిల్ ఇంజనీరింగ్ 8ఖాళీలు, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ 9 ఖాళీలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 5, సేఫ్టీ ఇంజనీరింగ్ విభాగంలో సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ 10 ఖాళీలు, మెకానికల్ ఇంజనీరింగ్ 28 ఖాళీలు , ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 9 ఖాళీలు, మెటలర్జీ ఇంజనీరింగ్ 2 ఖాళీలు ఉన్నాయి.
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60% మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. 2020, 21, 22 ఏడాదుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు తుది గడువు 8 సెప్టెంబర్ 2022తో ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.bharatpetroleum.in/పరిశీలించగలరు.
