TG 10th Supplementary Results 2026 : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదిగో..

TG 10th Supplementary Results 2026 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విడుదల అయ్యాయి.

BSE Telangana 10th Supplementary Results

TG 10th Supplementary Results 2026 : తెలంగాణ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ విడుదల చేశారు.. ఈ నెల 5వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగగా విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధించారు.

రెగ్యులర్ టెన్త్ ఫలితాల మాదిరిగానే ఈ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. 2026లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 31,736 మంది విద్యార్థులు అప్లయ్ చేయగా వారిలో 27,857 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో రికార్డు స్థాయిలో 23,013 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా మొత్తం 82.61 శాతంగా నమోదైంది.

ఈసారి కూడా బాలికలే రాణించారు. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వారిలో 17.568 మంది బాలురు ఉన్నారు. వీరిలో 14,281 మంది మాత్రమే పాస్ అయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 81.29 శాతంగా నమోదైంది. బాలికల్లో 10,289 మంది ఉంటే వారిలో 8,732 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 84.87శాతంగా నమోదైంది. బాలురల కన్నా బాలికల 3.58 శాతంతో ఆధిక్యంలో నిలిచారు.

ఫలితాల కోసం ఈ (Direct Link) లింక్ క్లిక్ చేయండి..