తెలంగాణలో 2020-2021 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించే ఎంసెట్, పీజీ ఈసెట్, లాసెట్, పీజీ లాసెట్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి గురువారం(జనవరి 23, 2020) ఒక ప్రకటనలో తెలిపారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 5, 2020 నిర్వహించాల్సిన ఎంసెట్ పరీక్షలను మే 4, 2020 నుంచి ప్రారంభించనున్నారు. మే 27 నుంచి 30 వరకు జరగాల్సిన పీజీ ఈసెట్ పరీక్షలను మే 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా శాఖ మండలి తెలిపింది. మిగతా పరీక్షలను ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మారిన పరీక్ష షెడ్యూల్ ఇదే :
సెట్ | పరీక్ష తేదీ |
---|---|
ఈసెట్ | మే 2, 2020 |
ఎంసెట్(ఇంజనీరింగ్) | మే 4, 2020 నుంచి మే 8, 2020 |
ఎంసెట్(అగ్రికల్చర్, ఫార్మసీ) | మే 9,2020నుంచి మే 11,2020 |
పీఈసెట్(ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్) | మే 13, 2020 |
ఐసెట్ | మే 20, 2020 నుంచి మే 21, 2020 |
ఎడెసెట్ | మే 23, 2020 |
లాసెట్, పీజీ లాసెట్ | మే 27, 2020 |
పీజీ ఈసెట్ | మే 28, 2020 నుంచి మే 31,2020 |