CLAT-2023 : లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023

అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా క్లాట్‌ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Common Law Admission Test (CLAT) 2023 for admissions in Law UG and PG Courses

CLAT-2023 : దేశవ్యాప్తంగా లా యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆమేరకు నేషనల్‌ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 2023-24 విద్యాసంవత్సరానికిగానూ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్‌) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌, 10+2 తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా క్లాట్‌ ప్రవేశ పరీక్ష (యూజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు క్లాట్‌ ఎల్‌ఎల్‌ఎమ్‌ (పీజీ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 22 యూనివర్సిటీల్లో లా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

రాత పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో నవంబర్‌ 13, 2022వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్ష డిసెంబర్‌ 18, 2023వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. క్లాట్‌ 2023 ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.consortiumofnlus.ac.in. పరిశీలించగలరు.