Contract Jobs : మహబూబ్ నగర్ జీఎంసీలో ఒప్పంద ఉద్యోగాలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Updated on- April 4, 2022 / 10:49 AM IST
Gmc Mahabubnagar
Contract Jobs : తెలంగాణా ప్రభుత్వానికి చెందిన మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టరేట్ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 98 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ , పాథాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్లు 64 ఖాళీలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 10 ఖాళీలు, ప్రొఫెసర్లు 2ఖాళీలు, అసోసియేట్ ప్రొఫెసర్లు 15 ఖాళీలు, ట్యూటర్లు 7 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఇంటర్యవూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు ఏప్రిల్ 8, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. ఇంటర్యూను ఏప్రిల్ 12, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : www.gmcmbnrnts.org/సంప్రదించగలరు.
