CSIR Recruitment 2025
CSIR Recruitment 2025 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (IITR) లక్నో జూనియర్ రీసెర్చ్ సెక్రటేరియట్ (JSA) పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (csiriitrprograms.in)లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
అభ్యర్థులు చివరి తేదీ 19 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కూడా ఇదే తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది.
సీఎస్ఐఆర్ జేఎస్ఏ ఖాళీల వివరాలివే :
ఈ CSIS ఖాళీలు జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ కీపర్, పర్చేజ్ కేటగిరీల్లో ఉన్నాయి. అభ్యర్థులు పోస్ట్ ప్రకారం ఖాళీల వివరాలను చెక్ చేయవచ్చు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)అర్హతలివే :
సీఎస్ఐఆర్ ఐఐటీఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే, ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు, హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ద్వారా అర్హతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
వయోపరిమితి :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు. అదే సమయంలో, రిజర్వ్డ్ వర్గాలకు నిబంధనల ప్రకారం.. గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థుల వయస్సును 2025 మార్చి 19 ఆధారంగా లెక్కిస్తారు.
జీతం : ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 3 ప్రకారం.. నెలకు రూ. 35,600 జీతం ఇస్తారు.
దరఖాస్తు రుసుము : జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యుఎస్ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC/ST/PH, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ : ఈ పోస్టులకు ఎంపిక ప్రకియ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
ఈ ప్రభుత్వ ఉద్యోగానికి రాత పరీక్ష పేపర్-1, పేపర్-2 ఫార్మాట్‌లో OMR లేదా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. పరీక్షలో 200 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షా వ్యవధి 2:30 నిమిషాలు అంటే.. రెండున్నర గంటలు ఉంటుంది. పేపర్-2లో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. పేపర్-2లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
పేపర్-2 ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ఈ నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం, అభ్యర్థులు CSIR అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు.