Gold Deposit Scheme : బంగారంపై డబ్బులు సంపాదించే అద్భుత అవకాశం.. గోల్డ్ ఇలా డిపాజిట్ చేయండి.. వడ్డీతోనే హాయిగా బతికేయొచ్చు!

Gold Deposit Scheme : మీ ఇంట్లో బంగారాన్ని లాకర్‌లో పెడదామని అనుకుంటున్నారా? ఈ బ్యాంకులో మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. వడ్డీ కూడా పొందవచ్చు.

Gold Deposit Scheme : బంగారంపై డబ్బులు సంపాదించే అద్భుత అవకాశం.. గోల్డ్ ఇలా డిపాజిట్ చేయండి.. వడ్డీతోనే హాయిగా బతికేయొచ్చు!

SBI Revamped Gold Deposit Scheme

Updated On : February 25, 2025 / 4:02 PM IST

Gold Deposit Scheme : బంగారం కొనగానే సరిపోదు.. ఆ బంగారాన్ని జాగ్రత్తగా దొంగలపాలు కాకుండా కాపాడుకోవాలి. సాధారణంగా చాలామంది ఇంట్లో బంగారం ఎక్కువగా ఉంటే దొంగల భయంతో బ్యాంకు లాకర్లలో దాచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇందుకోసం ఆయా బ్యాంకులకు డబ్బులను కూడా చెల్లిస్తుంటారు. లాకర్లలో బంగారాన్ని దాచుకుంటే బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి.

Read Also : MSSC Scheme : మహిళలు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మార్చి 31లోగా ఇందులో పెట్టుబడి పెట్టండి.. రెండేళ్లలో మీ డబ్బు డబుల్ అవుతుంది!

కానీ, మీరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)లో బంగారం దాచుకుంటే.. మీ బంగారం సేఫ్ గా ఉండటమే కాదు.. మీరు రూపాయి కూడా ఎస్బీఐకి చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే.. ఎలాంటి ఛార్జీలు ఉండవు అనమాట. ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ బంగారం ద్వారా మీరు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటారా? ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సాధ్యమే.

మొత్తం 3 డిపాజిట్ ఆప్షన్లు :
మీరు కూడా గోల్డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అద్భుతమైన అవకాశం. ఎస్బీఐలో మీకు అకౌంట్ ఉంటే చాలు.. మీ బంగారంపైనే వడ్డీతో డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం ఎస్బీఐ గోల్డ్ డిపాజిట్ పథకం (R-GDS) అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ ప్రకారం.. మీరు బంగారాన్ని 3 విధాలుగా డిపాజిట్ చేసుకోవచ్చు.

ఒక కస్టమర్ తన బంగారాన్ని మూడు కేటగిరీలుగా డిపాజిట్ చేయవచ్చు. మొదటి కేటగిరీలో బంగారాన్ని ఒక ఏడాది నుంచి 3 ఏళ్లు డిపాజిట్ చేస్తారు. దీన్నే షార్ట్ టెర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD) అంటారు. రెండో కేటగిరీలో మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD) అంటారు. దీని మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లు ఉంటుంది. లాంగ్ టర్మ్ గవర్నెమెంట్ డిపాజిట్ (LTGD) కేటగిరీ కింద బంగారాన్ని 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పాటు డిపాజిట్ చేయొచ్చు.

ఎంత వడ్డీ వస్తుందంటే? :
స్వల్పకాలిక బ్యాంకు డిపాజిట్ల కింద ఒక ఏడాది పాటు 0.55 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. 2 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి 0.60 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. మీడియం టర్మ్ కేటగిరీలో బంగారం డిపాజిట్లు 5 నుంచి 7 ఏళ్ల కాలానికి చేయాలి. అప్పుడు మీకు 2.25 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది.

అలాగే, మీరు లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్‌ అంటే.. 12 ఏళ్ల నుంచి 15 సంవత్సరాల వరకు ఎంచుకుంటే.. మీకు 2.50 శాతం వడ్డీ లభిస్తుంది. MTGD, LTGD విషయానికి వస్తే.. బంగారం లేదా దానిపై వడ్డీని ప్రతి ఏడాది మార్చి 31న లేదా మెచ్యూరిటీ సమయంలో కరెన్సీ రూపంలో చెల్లిస్తారు.

మెచ్యూరిటీ సమయంలో రెండు ఆప్షన్లు :
ఎఫ్‌డీ (FD)మెచ్యూరిటీ వ్యవధి ముగిసిన తర్వాత కస్టమర్లు తమ బంగారాన్ని వడ్డీతో పాటు తీసుకోవచ్చు. ఇందుకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలంటే బంగారం రూపంలో తీసుకోవచ్చు. లేదంటే ప్రస్తుత బంగారం ధరకు సమానమైన క్యాష్ కూడా తీసుకోవచ్చు.

Read Also : Money Saving Tips : కొత్తగా ఉద్యోగంలో చేరారా? మీ జీతం ఎంత ఉన్నా సరే.. ఇలా బడ్జెట్ వేస్తే.. మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు!

ఈ పథకాన్ని ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఇళ్ళు, కంపెనీల్లో నిల్వ చేసిన బంగారాన్ని సేకరించి దానిపై వడ్డీని సంపాదించడానికి వినియోగదారులకు అవకాశం కల్పించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యంగా చెప్పవచ్చు.