DCCB Vizianagaram Recruitment : విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

DCCB Vizianagaram Recruitment
DCCB Vizianagaram Recruitment : విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా అధికారులు ప్రకటించారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్. ఆంగ్ల భాషా పరిజ్ఞానం, తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ల పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
READ ALSO : Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎంపికైన వారికి నెలకు రూ.17,900 నుంచి రూ.47,920 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా 15, ఏప్రిల్ 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.dccbvizianagaram.com/ పరిశీలించగలరు.