Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కాని వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒక సారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం, రంగు, నీటి టర్ బిడిటీ ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి.

Fish Farming : వేసవిలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Fish Farming

Fish Farming : వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పుల వలన వేసవి  ముందుగానే ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి.  ప్రస్తుత పరిస్థితులు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో సహజసిద్దమైన జలాశయములు, చెరువులు, కుంటలలో చేపల పెంపకము సాగవుతుంది.  వివిధ కారణములు వలన నీటి మట్టము క్రమేపి తగ్గడం జరుగుతుంది. వేసవి ముగిసే వరకు నీరు క్రొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటి వనరులలో వున్న చేపలను నిశితంగా    గమనిస్తూ,తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే, ఆకస్మికముగా చేపలు చనిపోయే ప్రమాదములను నివారించి, ఆర్ధిక నష్టము కలుగకుండా చేసుకొనవచ్చును.

READ ALSO : Sameekrutha Vyavasayam : కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంచుతున్న ఏలూరు జిల్లా రైతు

వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల , రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు , రొయ్యలు  చనిపోయే ప్రమాదం  ఉంది . ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వరా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. చెరువుల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉన్నప్పుడు చేపలు, రొయ్యల జీవక్రియలు పెరిగి అధికంగా పెరుగుదలకు తోడ్పడతాయి.

  1. ఈ సమయంలో సరైన మోతాదులో చేపలకు దాణాను అందించాలి.
  2. మోతాదుకు మించి మేతను చెరువుల్లో వేస్తే, మేతలో ఉండే అమ్మోనియం, నత్రజని వంటి పోషకాలు చెరువు సమతుల్యం దెబ్బతీస్తాయి.
  3. వృక్ష, జంతు, ప్లవకాలు విపరీతంగా పెరిగి అల్గాల్ బ్లూమ్స్ ఏర్పడుతాయి.
  4. ఇటు అధిక ఉష్ణోగ్రతల ద్వారా నీటిలో ఉండే ప్లవకాలు విపరీతంగా పెరిగి చనిపోయి, చెరువు పై భాగంలో ఒక తెట్టువలే ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి.

 

READ ALSO : Fish Rain Reason : చేపల వర్షానికి కారణం ఏంటి? అసలు చేపలు ఆకాశంలో ఎలా వెళ్లాయి?

సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు, రొయ్యలు చనిపోతుంటాయి. కాని వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒక సారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం, రంగు, నీటి టర్ బిడిటీ ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి. ఆహారం, మేత వృధాకాకుండా సరైన మోతాదులో చేపల ద్రవ్యరాశిలో 4 శాతం ఇవ్వాలి. చెక్ ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి.

ముఖ్యంగా చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిన సమయంలో మర పడవలు, తెప్పల ద్వారా చెరువంతా కలియ తిరగాలి. సాధ్యమైనంత వరకు పెద్ద  సైజు చేపలను పాక్షికంగా గాని, పూర్తిగాకాని చెరువుల నుంచి వేరుచేసి అమ్ముకోవాలి. చెరువుల్లోని నీటి మొక్కలను చంపడానికి రైతులు వివిధ రకాలైన గుల్మనాశకాలను ఉపయోగిస్తుంటారు. వీటిలోని విషపుకారకం ద్వారా ఒత్తిడిలో ఉన్న చేపలు, రోయ్యలు మరణిస్తాయి.

READ ALSO : ఆరోగ్యానికి చేపలు : ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే తినకుండా ఉండరు

అందువల్ల కలుపు మొక్కలను భౌతికంగా నివారించాలి.  గడ్డి చేపలను చెరువుల్లో వదులుకోవడం ద్వారా నీటిలో పెరిగే నాచు, గడ్డి మొక్కలను నియంత్రించుకోవచ్చు.   రైతులు ఈ  యాజమాన్య పద్ధతులను ముందస్తుగా పాటించినట్లైతే, చేపలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.