Fish Rain Reason : చేపల వర్షానికి కారణం ఏంటి? అసలు చేపలు ఆకాశంలో ఎలా వెళ్లాయి?

చేపల వర్షం.. జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాన చినుకులతో పాటు చేపలు పడుతుండటం వింతగా అనిపిస్తోంది. చేపల వర్షం వెనుకున్న మిస్టరీ ఏంటి? అసలు చేపలు ఆకాశంలోకి ఎలా వెళ్లాయి?(Fish Rain Reason)

Fish Rain Reason : చేపల వర్షానికి కారణం ఏంటి? అసలు చేపలు ఆకాశంలో ఎలా వెళ్లాయి?

Fish Rain Reason

Fish Rain Reason : వర్షా కాలం వస్తే వానలు పడటం, వరదలు రావడం కామన్. అప్పుడప్పుడు వడగళ్లు పడటం సర్వ సాధారణం. కానీ, వీటికి భిన్నంగా వింతగా కొన్నిసార్లు చేపల వర్షం కూడా కురుస్తోంది. అవి కూడా మబ్బుల్లో నుంచి చినుకుల్లా రాలి నేల మీద పడతాయి. ఈ వింత చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో పడ్డాయి. ఇప్పుడు ఖమ్మంలో పడ్డాయి. అసలు చేపల వర్షం వెనుకున్న కారణం ఏంటి? అసలు ఆకాశంలోకి చేపలు ఎలా వెళ్లాయి?

Danger Fish : వర్షంలో చేపలు.. వండుకు తింటున్న జనాలు.. మంచిదేనా?

చేపల వర్షం.. వినడానికి వింతగా ఉంది కదూ. మరి కళ్లారా చూస్తే ఇంకెంత ఆశ్చర్యంగా ఉంటుందో కదా. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చేపల వర్షం కామన్ గా మారింది. ఆకాశం నుంచి వాన చినుకులతో పాటు చేపలు కూడా నేల మీద పడుతున్నాయి. చేపల వర్షమే పెద్ద వింత అనుకుంటే, ఆ చేపలు చూడటానికి చాలా వింతగా, భయంకరంగా ఉండటం మరో పెద్ద వింతగా చెప్పుకుంటున్నారు జనాలు.

Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం

ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో చేపల వర్షం కురిసింది. పినపాకలో ఆకాశం నుంచి వింత చేపలు వర్షంలా కింద పడ్డాయి. ఈ చేపలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఉండటంతో స్థానికులు వాటిని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు వాటిని పట్టుకుని మరీ ఆసక్తిగా పరిశీలించారు. భారీ వర్షానికి రిజర్వాయర్ నుంచి చేపలు ఎగిరి వచ్చి పడి ఉండొచ్చని, దీని వల్లే వరద నీటిలో కొట్టుకుని వచ్చి ఉంటాయని స్థానికులు తొలుత భావించారు. కానీ, ఈ చేపలు మనం ఎప్పుడూ చూసిన వాటిలా కాకుండా విచిత్రంగా ఉండటంతో ఆకాశం నుంచే కిందకు పడ్డాయని నిర్ధారణకు వచ్చారు.

ఇటీవలే జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలోనూ చేపల వర్షం కురిసింది. ఆకాశం నుంచి చేపలు కింద పడ్డాయి. దీంతో జనం ఎగబడి మరీ చేపలను పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. గత నెల 20వ తేదీన కూడా కాళేశ్వరంలో చేపల వర్షం కురిసింది. మహదేవ్ పూర్ మండలంలో అటవీ ప్రాంతంలో చేపలతో కూడిన వర్షం కురిసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనిపించడంతో వాటిని పట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత ఊహించని రీతిలో తాజాగా మరోసారి చేపల వర్షం పడటంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వర్షంతో పాటు చేపలు కూడా ఫట్ ఫట్ మని శబ్దం చేస్తూ కింద పడటంతో జనమంతా బయటకు పరుగులు తీసి వాటిని ఆసక్తిగా గమనించారు. వింత చేపలు ప్రత్యక్షం కావడంతో ఆశ్చర్యపోయారు. ఏపీలోనూ చేపల వర్షం ఘటనలు జరిగాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

నిజానికి చేపల వర్షం కురవడం అంత పెద్ద వింతేమీ కాదు. అవి ఆకాశం నుంచే వచ్చినా.. వాస్తవానికి అవి ఆకాశంలో ఉండవు. భూమి మీద నుంచే మేఘాల్లోకి వెళ్లి చేరతాయి. నదులు, సముద్రాల్లో సుడిగుండాలు ఏర్పడి అవి ఆకాశానికి ఆవిరయ్యే సమయంలో చేపలు కూడా మేఘాల్లోకి వెళ్లిపోతాయి. ఇది జరిగే సమయంలో సముద్రంలో కొన్ని రకాల కదలికలు ఏర్పడతాయి. మెరుపులు, ప్రచండమైన గాలుల వల్ల సముద్రంలో ఉండే చేపలు గుడ్లు, చిన్న చిన్న కప్పల గుడ్లు ఆవిరి ద్వారా మేఘాల్లోకి వెళ్తాయి. అలా చేరుకుని ఆ మేఘాలు వర్షంలా మారి కురిసినప్పుడు నీటితో పాటు చేపలు కూడా వర్షంలా కిందకు పడతాయి.

చేపల వర్షం వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు. అసలు వర్షంగా కురుస్తున్న చేపలన్నీ మేఘాల నుంచి కిందకు పడేవి కాదు. ఆకాశంలో చేపలు ఉండటం అసాధ్యం. వర్షాకాలం ప్రారంభంలో చెరువులు, కుంటల్లో లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఆ సమయంలో యాంఫీబియస్ నేచర్ ఉన్న నల్లటి చేపలు గాల్లోకి ఎగురుతాయి. వీటికి నేల మీద, నీటి మీద బతికే శక్తి ఉంటుంది. వర్షం, గాలి వచ్చిన సమయంలో ఇవి గాల్లోకి ఎగిరి మళ్లీ వర్షంతో పాటు కిందకు పడతాయి. దీన్ని చూసి చేపల వర్షం కురిసిందని జనాలు ఆశ్చర్యపోతుంటారు.