Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం

పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. ఆ చేపలు వింత ఆకారంలో ఉన్నాయి. చూడటానికి భయానకంగా ఉన్నాయి.

Kaleshwaram Fish Rain : కాళేశ్వరంలో కలకలం.. భయంకరమైన ఆకారంలో చేపల వర్షం.. భయాందోళనలో జనం

Fish Rain

Kaleshwaram Fish Rain : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో తరుచూ వింత ఘటన చోటు చేసుకుంటోంది. వానా కాలంలో ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. వర్షపు చినుకులతో పాటు చేపలు పడటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇవాళ(జులై 5) కాళేశ్వరంలో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడ్డాయి. ప్రాణంతో ఉన్న వాటిని కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే, ఇలాంటి ఘటనే గత నెల 20న కూడా చోటు చేసుకుంది. మహదేవ్ పూర్ మండలంలో అటవీ ప్రాంతంలో చేపల వర్షం కురిసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనిపించడంతో వాటిని పట్టుకున్నారు. తాజాగా ఇవాళ మరోసారి చేపల వర్షంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాంతంలో మాత్రమే ఇలా జరుగుతోందని చర్చించుకుంటున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాళేశ్వరంలో రెండు పర్యాయాలు చేపల వర్షం కురవడం ఆసక్తికరంగా మారింది. పైనుంచి చేపలు కింద పడటం ఒక ఆశ్చర్యం కలిగించే అంశం అయితే, అవి చూడటానికి చాలా భయంకరంగా ఉండటం మరో ఆశ్చర్యం కలిగించే అంశం. ఆ చేపలు చాలా వింత ఆకారంలో ఉన్నాయి. చేపల వర్షం కురవడం ఏంటి అనేది స్థానికులకు అంతుపట్టడం లేదు. పైగా ఆ చేపలు కూడా కొత్త రకంగా, వింతగా ఉన్నాయని చెబుతున్నారు.

Eiffel Tower: ఈఫిల్ టవర్‌కు తుప్పు.. రిపైర్ చేయకుంటే తప్పదు ముప్పు

Fish Rain In Kaleshwaram, Locals Worried About Fish Shape

Fish Rain In Kaleshwaram, Locals Worried About Fish Shape

అంతేకాదు అవి నల్లరంగులో భయానకమైన ఆకారంలో ఉన్నాయని, తినడానికి కూడా పనికి రావని చెబుతున్నారు. ఆ చేపల ఆకారం ఎంత వికృతంగా ఉన్నాయంటే.. వాటిని పట్టుకోవడానికి కూడా కొందరు వెనకడుగు వేస్తున్నారు. చూడటానికి నల్లగా, భయంకరంగా ఉన్న ఆ చేపలను వండుకుని తింటే ఏం జరుగుతుందో అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. కాళేశ్వరంలో కురిసిన వర్షంలో బైపాస్ రోడ్, మజీద్ పల్లి రోడ్డుపై ఈ చేపలు ప్రత్యక్షం అయ్యాయి. ఆ చేపలను కళ్లారా చూసిన వాళ్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

Fish Rain In Kaleshwaram, Locals Worried About Fish Shape

Fish Rain In Kaleshwaram, Locals Worried About Fish Shape

గత నెల కూడా పెద్ద ఎత్తున చేపల వర్షం కురిసింది. వాటిని పట్టుకుని వండుకుని తినే ప్రయత్నం చేసినప్పటికి, వాటి ఆకారాన్ని చూసి కొంత భయాందోళన చెందారు. దీంతో తిరిగి ఆ చేపలను తీసుకెళ్లి సమీపంలోని నీటి గుంతలో పడేశారు. ఇవాళ కూడా చేపల వర్షం కురిసింది. అదే రకమైన ఆకారంలోని చేపలు పడ్డాయి. వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో మాత్రమే వింత చేపల వర్షం కురుస్తుండటం స్థానికులను హడలెత్తిస్తోంది.

China : చైనాలో పుచ్చకాయలు, గోధుమలకు ఇళ్లు అమ్ముకుంటున్న బిల్డర్లు