Ys Jagan: ఆది నారాయణరెడ్డిపై వైసీపీ బలమైన అస్త్రం..! సొంత జిల్లాలో పరిస్థితులను సెట్‌రైట్ చేస్తున్న జగన్..
2024 ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ రేసులో రామసుబ్బారెడ్డి పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికే అవకాశం ఇచ్చారు జగన్.
Ys Jagan: ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. అందుకే ముందు సొంత జిల్లాలో పరిస్థితులను సెట్ చేసుకునే పనిలో పడ్డారట వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెంచారు. ఎక్కడా మొహమాటానికి తావు లేకుండా పార్టీ పటిష్టం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కడప జిల్లాలో జమ్మలమడుగు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇంచార్జి స్థానం నుంచి తప్పించి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చారు జగన్.
ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో వైసీపీ క్యాడర్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి దగ్గరయ్యారు. సుధీర్‌రెడ్డి గెస్ట్ రోల్ ప్లే చేస్తుండటంతో..లోకల్ లీడర్లు పక్క చూపులు చూశారు. ఫైనల్‌గా కార్యకర్తల కన్ఫ్యూజన్‌కు రామసుబ్బారెడ్డి నియామకంతో తెర దించేశారు వైసీపీ అధినేత జగన్. జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రామసుబ్బారెడ్డి యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారు.
రామసుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జమ్మలమడుగులో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న పొన్నపురెడ్డి కుటుంబానికి టీడీపీలో చెరగని ముద్ర ఉంది. అదే కుటుంబం నుంచి కీలక నాయకుడిగా ఉన్న రామసుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది.
సుధీర్‌రెడ్డి ప్లేస్‌లో బలమైన నేతకు బాధ్యతలు..
ఇక 2024 ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ రేసులో రామసుబ్బారెడ్డి పేరు వినిపించినా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డికే అవకాశం ఇచ్చారు జగన్. అయితే అక్కడ ఆది నారాయణరెడ్డి దూకుడును ఎదుర్కోవడంతో సుధీర్ రెడ్డి వెనకబడిపోతున్నారని వైసీపీ అధిష్టానం భావించిందట. అందుకే సుధీర్‌రెడ్డి ప్లేస్‌లో బలమైన నేతగా ఉన్న రామ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.
రగిలిపోతున్న సుధీర్ రెడ్డి.. దారెటు?
ఆది నారాయణరెడ్డిని ఢీకొట్టేందుకు అన్ని విధాలుగా రామసుబ్బారెడ్డి బలవంతుడని పార్టీ భావిస్తోందట. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆయన సేవలను పార్టీ కోసం వాడుకుని 2029లో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకు సుధీర్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి నియామకంపై సుధీర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. దాంతో సుధీర్ రెడ్డి దారెటు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
జమ్మలమడుగు అంటేనే వేడెక్కే రాజకీయం. పాలిటిక్స్ కు జూనియర్ అయిన సుధీర్ వర్సెస్ సీనియర్ పొలిటీషియన్ ఆది నారాయణరెడ్డిగా ఇన్నాళ్లు రాజకీయం నడిచింది. ఇప్పుడు సీనియర్ లీడర్ రామసుబ్బారెడ్డి వర్సెస్ సీనియర్ లీడర్ ఆదిగా మారబోతోంది. గతంలో వీరిద్దరూ తలపడిన ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పైచేయి సాధించారు. అదే వార్ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఆదినారాయణ రెడ్డిని ఢీకొట్టి రామసుబ్బారెడ్డి ఎంత వరకు సక్సెస్ అవుతారన్నదే చర్చ. జగన్ నిర్ణయంతో ఆ రెండు కుటుంబాల మధ్య మరోమారు పోరు షురూ అయ్యినట్లు అయింది. లోకల్ దంగల్ సమీపిస్తున్న వేళ జగన్ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఎంత మైలేజ్ తెచ్చి పెడుతుందో చూడాలి.
Also Read: ఏపీలో పేద వర్గాల ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికి ఒక్కొక్కరికి రూ.50వేలు.. ఫ్రీగానే ..
