×
Ad

ఎడ్యుకేషన్ : 15న DSC 2018 మెరిట్ లిస్టు

  • Published On : February 13, 2019 / 02:09 AM IST

విశాఖపట్టణం : డీఎస్సీ 2018 మెరిట్ లిస్టు కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 15వ తేదీన లిస్టును విడుదల చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలి కీ 4న విడుద చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 12న ఫలితాలు వెల్లడిస్తామని, అతి త్వరలోనే డీఎస్సీ – 2 నోటిఫికేషన్ వెల్లడవుతుందన్నారు. 

అంతేగాకుండా ఫిబ్రవరి, మార్చి, మే నెలలో జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ఫిబ్రవరి 19న ఏపీ ఈసెట్, 20-22 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, ఫిబ్రవరి 24వ తేదీన అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 26న ఏపీ ఐసెట్‌ను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, మే 1వ తేదీ నుండి 4 వరకు ఏపీపీజీ ఈసెట్‌ను ఏయూ (విశాఖ), మే 6వ తేదీన ఎడ్ సెట్‌ను ఎస్వీ యూనివర్సిటీ, 6వ తేదీన ఏపీ లాసెట్‌ను ఎస్కే యూనివర్సిటీ (అనంతపురం), 8 నుండి 15 వరకు ఏపీపీ ఈసెట్‌ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు) నిర్వహిస్తాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.