ONGC Recruitment : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి.
- Guntupalli Ramakrishna
- Published On : October 21, 2022 / 11:08 AM IST
ONGC Recruitment :
ONGC Recruitment : భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన డెహ్రాడూన్‌లోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 62 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, మెరైన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐసీడబ్ల్యూఏ గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://ongcindia.com/web/eng/career/recruitment-notice పరిశీలించగలరు.
