Kriya University: మనసు చెప్పిందే వినండి.. క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ 2023లో మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ

భారత ప్రభుత్వంలో ఉంటూ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సేవలకు ఆమె చేసిన కృషికిగాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కేంద్ర కార్యదర్శి సుజాత రావు.. వైద్య పరిశోధన ద్వారా ప్రపంచానికి చేసిన కృషికి గాను భారత్ బయోటెక్ వైద్య శాస్త్రం సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లాకు ఇచ్చారు

Gopalakrishna Gandhi: క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ 2023లో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, రచయిత గోపాలకృష్ణ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఈనాటి మీ సంతోషం రేపు అనేక పరిస్థితులకు ఒక మార్గంగా ఉంటుందని చెప్పాలనుకుంటున్నాను. జరగబోయేది జరగనివ్వండి, కానీ మీరు మీ మనస్సు ఏమి చెబుతుందో అది చేయండని మన గొప్ప గీత చెబుతుంది. దీర్ఘకాలంగా విస్మరించబడిన పెద్ద పెద్ద సమస్యలు యువకులు తీసుకున్న చర్యల ద్వారా చాలా తరచుగా పరిష్కరించబడతాయి. మీరంతా చాలా చీకటిగా ఉండే రాత్రిని ప్రకాశవంతం చేసే మెరుపుగల నక్షత్రాల వంటివారు’’ అని అన్నారు.

Malaika Arora : బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో మెరిసేందుకు.. మలైకా ఎంత ఖర్చు చేసి డ్రెస్ కొన్నదో తెలిస్తే షాక్ అవుతారు!

ఆంధ్రప్రదేశ్‭లోని శ్రీసిటీలో ఉన్న శనివారం క్రియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో కాన్వొకేషన్ వేడుక నిర్వహించారు. కాన్వొకేషన్ వేడుకలో UG కోహోర్ట్ ఆఫ్ SIAS (స్కూల్ ఆఫ్ ఇంటర్‌వోవెన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్), SIASలో PG డిప్లొమా, IFMR GSB (గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో 2-సంవత్సరాల MBA, IFMR GSBలో 3 సంవత్సరాల L&T MBA, క్రియా విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం (2023)లో PhDకి అవార్డులు, డిగ్రీలను ప్రదానం చేశారు.

WhatsApp Beta Users : వాట్సాప్ యూజర్లు.. ఇకపై హై-క్వాలిటీ వీడియోలను కూడా పంపుకోవచ్చు..!

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. వారిలో జాతీయంగా, అంతర్జాతీయంగా ఆరోగ్య సేవలకు కృషికిగాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కేంద్ర కార్యదర్శి సుజాత రావు.. వైద్య పరిశోధన ద్వారా ప్రపంచానికి చేసిన కృషికి గాను భారత్ బయోటెక్ వైద్య శాస్త్రం సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లాకు ఇచ్చారు. క్రియా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ఎన్ వఘుల్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిర్మలరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కపిల్ విశ్వనాథన్, IFMR GSB డీన్ ప్రొఫెసర్ లక్ష్మీ కుమార్, సియాస్ అకాడమిక్ డీన్ డాక్టర్ పృథ్వీ దత్తా శోభి, క్రియా కమ్యూనిటీలోని ఇతర సభ్యుల సమక్షంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.