Government Job : డిగ్రీ పాస్ అయితే చాలు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

Government Jobs (Photo : Google)

మీరు డిగ్రీ పాస్ అయ్యారా? ప్రభుత్వ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో (IB) జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

మొత్తం 995 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పే లెవెల్-7 ప్రకారం 44,990 రూపాయల నుంచి ఒక లక్ష 42వేల 400 రూపాయల మేర జీతం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు.. వెబ్ సైట్..www.mha.gov.in

Also Read : సెంట్‌ బ్యాంక్‌ హోం ఫైనాన్స్‌ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ

పోస్టు – Assistant Central Intelligence Officer, Grade II/Executive
పోస్టుల సంఖ్య – 995
విద్యార్హత – గ్రాడ్యుయేషన్
వయసు – 18-27 సంవత్సరాలు
దరఖాస్తుకు చివరి తేదీ – 15 డిసెంబర్ 2023
ఎంపిక ప్రక్రియ – రాత పరీక్ష, ఇంటర్వ్యూ
జీతం – రూ.44,900 నుంచి రూ.1,42,400
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అఫీషియల్ వెబ్ సైట్- mha.gov.in
రిక్రూట్ మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు- 450రూపాయలు
రాత పరీక్ష- 150 మార్కులకు
ఇంటర్వ్యూ – 100 మార్కులకు

ఎగ్జామ్ ప్యాటర్న్-టైర్ 1
కరెంట్ అఫైర్స్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
జనరల్ స్టడీస్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
రిజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
ఇంగ్లీష్ లాంగ్వేజ్ (20 ప్రశ్నలు, 20 మార్కులు)
మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు

Also Read : భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

టైర్-2
ఎస్సే రైటింగ్ – 30 మార్కులు
ఇంగ్లీష్ కాంప్రెహెన్షన్ అండ్ ప్రెసిస్ రైటింగ్ – 20 మార్కులు
మొత్తం -50 మార్కులు

ట్రెండింగ్ వార్తలు