AP DSC 2025 hall ticket: ఏపీ డీఎస్సీ 2025 హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

హాల్ టికెట్లను పోస్ట్‌లో పంపరు. అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Teacher

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 30న ఏపీ డీఎస్సీ టీచర్ రిక్రూట్‌మెంట్ 2025 హాల్ టిక్కెట్లను విడుదల చేయనుంది. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను టైప్‌ చేసి అధికారిక వెబ్‌సైట్ apdsc.apcfss.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ పరీక్షను జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఓ గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి.

డీఎస్సీకి 5.67 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 3,53,598 మంది అభ్యర్థులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, ఫొటో, సంతకం, పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులోని అన్ని వివరాలను ధ్రువీకరించుకోవాలి. ఏవైనా తేడాలు ఉంటే సాయం కోసం వెంటనే హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలి.

Also Read: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రేట్లు ఇలా..

హాల్ టికెట్లను పోస్ట్‌లో పంపరు. అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP DSC హాల్ టికెట్ 2025 ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

  • AP DSC అధికారిక పోర్టల్‌ను apdsc.apcfss.in ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో ఉన్న “డౌన్‌లోడ్ హాల్ టికెట్” లింక్‌పై క్లిక్ చేయండి
  • మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను టైప్ చేయండి
  • CAPTCHAను టైప్‌ చేసి సబ్మిట్‌ బటన్‌పై క్లిక్ చేయండి
  • మీ హాల్ టికెట్ వస్తుంది
  • దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి