చెక్ ఇట్ : IBPS క్లర్క్ పోస్టులకు అడ్మిట్ కార్డు రిలీజ్

  • Publish Date - November 27, 2019 / 05:39 AM IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)లో క్లర్క్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17,2019 న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు అభ్యర్ధుల నుంచి  అక్టోబర్ 9,2019 వరకు దరఖాస్తులు స్వీకరించారు, ఇప్పుడు డిసెంబర్ 7,8,14,21 తేదీల్లో నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష కోసం మంగళవారం (నవంబర్ 26, 2019)న అడ్మిట్ కార్డులను రిలీజ్ చేసింది.  

IBPSలో మెుత్తం  12 వేల 075 క్లర్క్ పోస్టులు ఉన్నాయి.  ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణకు 612 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ కు 777 పోస్టులను కేటాయించారు. 
 

ప్రిలిమినరీ పరీక్ష విధానం :
> ప్రిలిమినరీ పరీక్షలో మెుత్తం 100 ప్రశ్నలకు గాను 100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు ఉంటుంది.
> ఇంగ్లిష్ విభాగంలో 30, రీజనింగ్ ఎబిలిటీ విభాగంలో 35, న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో35 ప్రశ్నలు అడుగుతారు.ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.
 
మెయిన్స్ పరీక్ష విధానం :
> మెయిన్స్ పరీక్షలో మెుత్తం 190 ప్రశ్నలకు గాను 200 మార్కులు ఉంటాయి. జనరల్, ఫైనాన్షియల్ అవేర్ నెస్ లో 50, ఇంగ్లిష్ లో 40,  రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్  లో అప్టిట్యూడ్ 50, న్యూమరికల్ ఎబిలిటీ లో 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 160 నిమిషాలు ఉంటుంది.
 

ముఖ్య తేదిలు :
ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ తేది : నవంబర్ 26,2019 
ప్రిలిమినరీ పరీక్ష తేది :  7,8,14,21  డిసెంబర్,2019
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు : డిసెంబర్ 2019/జనవరి 2020
మెయిన్స్ పరీక్ష తేది : జనవరి 19,2020
ప్రొవిజినల్ అలాట్ మెంట్ : ఏప్రిల్ 2020

Read Also… అప్లై చేసుకోండి: నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు