ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి.
ఢిల్లీ : ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి జనవరి 12 వ తేదీ వరకు ఐఐటీ జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. దేశ వ్యాప్తంగా 273 సిటీలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 7 నగరాల్లో, ఆంధ్రప్రదేశ్ లో 18 నగరాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఈరోజు జరిగే పేపర్ కి 10 వేల మంది హాజరు కానునున్నారు. రేపటి నుంచి జరిగే పరీక్షలకు 70 వేల మంది విద్యార్థులు హాజరవుతారు. ప్రతి రోజు రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు తరలివస్తున్నారు.
అయితే ఇవాళ, రేపు భారత్ బంద్ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులకు గురికానున్నారు. పరీక్షలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్టీసీ సంఘాలు, ఆటో యూనియన్లు సమ్మెకు మద్దతు తెలపడంతో విద్యార్థులు సెంటర్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.