Indo-Tibetan Border Police Force Low Assistant Sub Inspector Vacancy
ITBP ASI Recruitment : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫార్మసిస్ట్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన మహిళా/పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఫిజక్స్, కెమిస్ట్రీ, బయోలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. అభ్యర్ధుల వయసు నవంబర్ 23, 2022వ తేదీ నాటికి 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.29,300ల నుంచి రూ.92,300ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.
ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని తాజాగా పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరొక అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 1, 2022వ తేదీ వరకు కొనసాగుతుంది. అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 23, 2022వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.itbpolice.nic.in/ పరిశీలించగలరు.