RFCL JOBS : ఆర్ ఎఫ్ సీ ఎల్ లో ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

Rfcl Jobs

RFCL JOBS : భారత ప్రభుత్వరంగ సంస్ధ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కు చెందిన నొయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సీ ఎల్ ) లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి ఇంజనీర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, చీఫ్ మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, సీనియర్ కెమిస్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. కెమికల్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, సేఫ్టీ, హెచ్ ఆర్, మెటీరియల్స్ తదితర విభాగాల్లో ఈఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్యూ అధారంగా ఎంపిక నిర్వహిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదిగా జులై 1, 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nationalfertilizers.com/ పరిశీలించగలరు.