Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉస్మానియాలో జాబ్ మేళా.. రూ.1.80 లక్షల జీతం.. అర్హత, పూర్తి వివరాలు మీకోసం
Job Mela: రాష్ట్రంలో నిరుద్యోగ నిర్ములన కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా జాబ్ మేళాను నిర్వహించనుంది.

Job fair in Osmania under the auspices of TG Employment Training Department
రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలన కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా జాబ్ మేళాను నిర్వహించనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణా శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI & GB), ఉస్మానియా యూనివర్సిటీ స,యుక్తంగా హైదరాబాదులో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 19న జరుగనున్న ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థ మిత్రా అరీనా ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ 40 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా ఈ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
విద్యార్హత:
ఈ జాబ్ మేళాకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల(పురుషులు & మహిళలు) వయసు 18 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
వేతన వివరాలు:
జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000 వరకు జీతం అందుతుంది.
అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలతో పాటు బయోడేటాను తీసుకొని జాబ్ మేళాకు హాజరుకావలసి ఉంటుంది.