APP Jobs: తెలంగాణలో 118 ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్.. నెలకు రూ.1.33 లక్షల జీతం.. అర్హత, దరఖాస్తు, పూర్తి వివరాలు
APP Jobs: తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. 118 ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Notification released for 118 APP posts in Telangana
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. 118 ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని సంబందించిన పూర్తి వివరాలు, దరఖాస్తు తేదీలు అధికారిక వెబ్ సైట్ https://www.tgprb.in/ లో తెలుసుకోవచ్చు.
విద్యార్హతలు:
అభ్యర్థులు లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ తప్పనిసరి. అలాగే రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి;
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 34 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీ, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు జీతం అందుతుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష ఉంటుంది. మొదటిది పేపర్ -1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రెండవది పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు.