AP EAPCET 2025: ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఎట్టకేలకు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. మీ అలాట్‌మెంట్ ఇలా చెక్ చేసుకోండి
AP EAPCET 2025; ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్థానికత విషయంలో తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది.

AP EAPSET 2025 final phase seat allocation completed
ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. స్థానికత విషయంలో తాజాగా హైకోర్టు తీర్పును వెల్లడించిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. అభ్యర్థులు తమ అలాట్మెంట్ ను అధికారిక వెబ్ సైట్ https://eapcet-sche.aptonline.in ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్ 2025 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆగస్టు 14వ తేదీన జరిగగా.. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 20 లోపు రిపోర్టింగ్ చేసుకోవాలి. రిపోర్టింగ్ ప్రక్రియ జరగకక్ పొతే కేటాయించిన సీటును రద్దు చేస్తారు. ఇక ఆగస్టు 18వ తేదీ నుంచి బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు మొదలవనున్నాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఈ లోపే విద్యార్థులు పైన తెలిపిన అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీ అలాట్మెంట్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో “డౌన్లోడ్ అలాట్ మెంట్ అర్డర్ ” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
- తరువాత మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
- తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి
- అప్పుడు మీకు కేటాయించిన కాలేజ్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి
- దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి అలాట్మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.