NABARD Recruitment 2023
NABARD Recruitment : బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !
విభాగాల వారీగా పోస్టుల వివరాలకు సంబంధించి జనరల్ – 77, కంప్యూటర్/ఇన్మర్మేషన్ టెక్నాలజీ – 40, ఫైనాన్స్ – 15, కంపెనీ సెక్రటరీ – 03, సివిల్ ఇంజనీరింగ్ – 03, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 03, జియో ఇన్మోమాటిక్స్ – 02, ఫారెస్ట్రీ – 02, ఫుడ్ ప్రాసెసింగ్ – 02, స్టాటిస్టిక్స్ – 02, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్ – 01 ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకునే రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?
పరీక్ష , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;www.nabard.org/ career పరిశీలించగలరు.