Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

జపాన్‌లోని సెండాయ్‌లోని తోహోకు యూనివర్శిటీ పరిశోధకులు హిప్పోకాంపస్‌లో మెదడు కుంచించుకుపోవటానికి చిగుళ్ల వ్యాధి,దంతాల సమస్యలే కారణమని కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తిలో కీలక పాత్ర పోషించటమే కాకుండా అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది.

Poor Dental Health : దంతాల శుభ్రత సరిగా లేకుంటే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా ? అధ్యయనం ఏంచెబుతుందంటే ?

Poor Dental Health

Poor Dental Health : నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల దంత సమస్యలతోపాటు, చిగుళ్ల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. ఇది చివరకు గుండె జబ్బులు, క్యాన్సర్ , మధుమేహం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. తాజాగా జపనీస్ పరిశోధకుల కొత్త అధ్యయనం మెదడు పరిమాణంలో క్షీణతకు దంత ఆరోగ్యంతో ముడిపడి ఉన్నట్లు తేలింది. మెరుగైన మెదడు ఆరోగ్యానికి మన దంతాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అని ఈ పరిశోధన ద్వారా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

READ ALSO : Day time sleep : పగటి పూట నిద్ర మెదడుకి మంచిదట.. పరిశోధకులు ఏమన్నారంటే..

జపాన్‌లోని సెండాయ్‌లోని తోహోకు యూనివర్శిటీ పరిశోధకులు హిప్పోకాంపస్‌లో మెదడు కుంచించుకుపోవటానికి చిగుళ్ల వ్యాధి,దంతాల సమస్యలే కారణమని కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తిలో కీలక పాత్ర పోషించటమే కాకుండా అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుంది. అంటే చిగుళ్ల వ్యాధి లేదా దంతాల సమస్యలు అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుందా అన్న విషయంపై అధ్యయనం నిర్ధారించలేకపోయినప్పటికీ దాని మధ్య అనుబంధాన్ని స్పష్టం చేసింది.

READ ALSO : Brain Tumor Risk : 5 ఉత్తమ ఆహారాలతో మెదడు కణితి ప్రమాదాన్ని నివారించండి !

అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన మెడికల్ జర్నల్ న్యూరాలజీ ఆన్‌లైన్ సంచికలో ఈ అధ్యయనంపై ఓ నివేదిక ప్రచురించబడింది. దంతాల సమస్యలు, చిగుళ్ల వ్యాధి చాలా సాధారణ సమస్యలు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యల కారణంగా చిత్తవైకల్యంత వంటి పరిస్థితులకు లోనవుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. దంతాల సమస్యలు,చిగుళ్ల వ్యాధి ఈ రెండు ఆలోచన, జ్ఞాపకశక్తిని నియంత్రించే మెదడు ప్రాంతం యొక్క సంకోచంతో ముడిపడి ఉన్నాయని వారు కనుగొన్నారు.

READ ALSO : America : గర్భంలోనే శిశువు మెదడుకు శస్త్ర చికిత్స.. తల్లీబిడ్డలు క్షేమం

అధ్యయనం కోసం, పరిశోధకులు సగటు వయస్సు 67 కలిగిన వారిని 172 మందిని పరిశోధనకు ఎంచుకున్నారు. దంత పరీక్షలు, జ్ఞాపకశక్తి పరీక్షలు, మెదడు స్కాన్‌లను అధ్యయనం ప్రారంభంలో నిర్వహించారు. అలాగే అధ్యయనం ముగింపులో మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకున్నారు. అధ్యయనం ప్రారంభంలో పాల్గొనేవారిలో ఎవరికీ జ్ఞాపకశక్తి సమస్యలు లేవు.

READ ALSO : Walnuts : మెదడు కణాలకు మేలుచేసే వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు !

అధ్యయనం ప్రారంభంలో మరియు నాలుగు సంవత్సరాల తరువాత తీసుకున్న పరీక్ష ఫలితాలను పోల్చినప్పుడు, వారు దంతాల సమస్యలు, చిగుళ్ల వ్యాధి , మెదడు ఎడమ హిప్పోకాంపస్‌లో మార్పుల మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. కాబట్టి దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధన ద్వారా స్పష్టం అవుతుంది.