Walnuts : మెదడు కణాలకు మేలుచేసే వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు !

ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే వాల్‌నట్‌ లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఖాళీ తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. పిల్ల‌ల‌కు రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుండి వాల్ న‌ట్స్ ను ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు చ‌క్క‌గా అభివృద్ధి చెందుతుంది.

Walnuts : మెదడు కణాలకు మేలుచేసే వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు !

Omega 3 fatty acids in walnuts are good for brain cells!

Walnuts : మెద‌డు అభివృద్ధికి వాల్ న‌ట్స్ చ‌క్క‌టి ఆహార‌మ‌ని అనేక ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. రోజుకు 5 నుండి 6 వాల్ నట్స్ ను నాన‌బెట్టుకుని మాత్ర‌మే తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. 40 గ్రాములు వాల్నట్ లో ఉండే పోషకాలకు సంబంధించి కేలరీలు185, నీరు 4% , ప్రోటీన్:3 గ్రాములు , పిండి పదార్థాలు:9 గ్రాములు, చక్కెర 7 గ్రాముల, ఫైబర్ 9 గ్రాములు, కొవ్వు 5 గ్రాములు ఉంటాయి.

వాల్ న‌ట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. 100 గ్రాముల వాల్ న‌ట్స్ లో 9 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. మెద‌డు క‌ణాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రీ రాడిక‌ల్స్ ను తొల‌గించేలా చేయ‌డంలో మ‌న‌కు వాల్ న‌ట్స్ లో ఫాలీ ఫినాల్స్ స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌న శ‌రీరానికి రోజుకు 1.1 గ్రాముల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. రోజూ 6వాల్ నట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమకూర్చుకోవచ్చు.

మెద‌డు క‌ణాలు కుశించుపోకుండా జీవిత కాలం పాటు ఆరోగ్యంగా ఉండేలా చేయ‌డంలో వాల్ న‌ట్స్ లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తోడ్పడతాయి. దీని కారణంగా మెద‌డు క‌ణాలపై ఒత్తిడి త‌గ్గడంతో పాటు వాటి ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. వాల్ న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ఈ విధంగా మ‌న మెద‌డుకు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని క‌నుక వీటిని ప్ర‌తి ఒక్క‌రు ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే వాల్‌నట్‌ లను డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఖాళీ తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. పిల్ల‌ల‌కు రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుండి వాల్ న‌ట్స్ ను ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో మెద‌డు చ‌క్క‌గా అభివృద్ధి చెందుతుంది. అలాగే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మెదడులో క‌ణాలు ఆరోగ్యంగా ఉండ‌డంతో పాటు జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగవుతుంది.

వాల్నట్ తినడం వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది దీనిలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ను సమృద్ధిగా కలిగి ఉంది. ఇది శరీరంలోని రక్తప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వార శరీరంలోని అవయవాలకు రక్తం సరఫరా బాగుగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంతో ఉంటుంది. మధుమేహ రోగులు నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి.

జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే వాల్ నట్స్ తీసుకోవటం అవసరం. అదే సమయంలో వాల్ నట్స్ తినే విషయంలో కొందరు జాగ్రత్తలుపాటించాలి. అలర్జీ లక్షణాలున్న ఉన్నవారు ఈ వాల్నట్ కు దూరంగా ఉంచడం మంచిది. వాల్ నట్స్ ఫైటిక్ యాసిడ్లో ఎక్కువగా ఉంటాయి దీనివల్ల చాతిలో మంట లేదా గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.